ఎస్సీల అభివృద్ధికి పాటుపడతాం
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ముషీరాబాద్, మార్చి 15(విజయక్రాంతి): ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు రాజు వస్తాద్, జాతీయ సెక్రటరీ జనర ల్ బి. హరికృష్ణ, నగర అధ్యక్షులు సత్యనారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కార్యవర్గ సభ్యులు ఎన్నికల అధికారి రాయకంటి నర్సింగ్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం, నిస్వార్థంగా కృషి చేస్తామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎస్సీల అభివృద్ధికి పాటుపడతామని కార్యవర్గ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ నాయకులు పి.జగన్నాథం, ముత్తయ్య, వెంకటేశం, వైద్యనాథ్, పచ్చ శ్రీనివాస్, అనిల్, నవీన్, శోభారాణి, ఆకుల సుదర్శనం, వందనం, ఆవుల సుధీర్ తో పాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.




