16 March, 2026 | 5:20 AM

మేడ్చల్‌లో మహిళ గొంతు కోసి హత్య

16-03-2026 01:04 AM

మేడ్చల్ అర్బన్, మార్చి 15(విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో దారుణంగా మహిళా గొంతు కోసి హత్య చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ రామలింగేశ్వర ఆలయ సమీపంలో గల ఒక గదిలో గుర్తు తెలియని మహిళను దుండగులు కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్టు తెలిపారు. మృతురాలు సుమారు 35 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుందని దుండగుల కోసం పోలీసు బృందాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హత్యకు గురైన మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందని మేడ్చల్ పోలీసులు వెల్లడించారు. మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు స్పష్టం చేశారు..