21 May, 2026 | 4:17 AM

బాధితులకు భరోసాగా ఉంటాం

21-05-2026 12:51 AM

బైంసా మే ౨౦,( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను ఆశ్రయించి ఇస్తే వారికి పూర్తిగా భరోసా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం బైంసా పట్టణంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.

ఫిర్యాదులు ఎక్కువగా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు ఎక్కువగా ఉండటంతో వాటి పరి ష్కారానికి పోలీస్ శాఖ సత్వరం చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న సిబ్బందిని సూచించా రు. ఇప్పటివరకు పోలీస్ శాఖ ప్రజావాణికి మంచి స్పందన వచ్చిందని షీ టీం సభ్యులు కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించి రాజీమార్గంలో సమస్యకు పరిష్కారం చూస్తున్నమన్నారు ఈ కార్యక్రమంలో  పోలీసులు పాల్గొన్నారు.