21 May, 2026 | 5:28 AM

కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లు

21-05-2026 12:51 AM

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): యాసంగి పంటకు సంబంధించి రాష్ట్రంలో మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో మొక్కజొన్న పంట 43.18 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. ఇందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం భావిస్తుంది.

జిల్లాల వారీగా మొత్తం 14.89 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. బుధవారం నాటికి మొత్తం 11.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది. కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. ఆ జిల్లాలో ఇప్పటివరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నులు కొను గోలు చేశారు.

తర్వాతి స్థానాల్లో నాగర్‌కర్నూ ల్ 1.55 లక్షల మెట్రిక్ టన్నులు, వరంగల్ 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.నిల్వల విషయంలో మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అవసరం. ప్రస్తుతం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అందుబాటులో ఉంది. ఎక్కడికక్కడే సరిపడే నిల్వ స్థలా లను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.