తాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తాం
అలంపూర్, జూన్ 30: గత పది రోజులుగా అమరవాయి, మానవపాడు గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆయా గ్రామాల సర్పంచులు హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్లు మంగళవారం గద్వాల్లో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ ఈఈ పరమేశ్వరిని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు రాత్రి వేళల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ ఈ దృష్టికి తీసుకెళ్లారు సమస్య తీవ్రతను వివరిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు.తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరగా, ఈఈ పరమేశ్వరి సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిశీలించి అతి త్వరలోనే తాగునీటి సరఫరా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు






