ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తాం
మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్మల్, ఏప్రిల్ 24 (విజ యక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో టీజీ ఆర్టీసీని సంరక్షించుకునే బాధ్యత ప్రభుత్వం కార్మికు లపై ఉందని కార్మికులు లేవలెత్తిన డిమాండ్లను ప్రభు త్వం తప్పకుండా పరిష్కరిస్తుందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో గత రెండు మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సంబంధిత అధికారులతో ఆరా తీశారు.
ఆర్టీసీ కార్మికుల డి మాండ్లు న్యాయబద్ధమైనవిని ఎన్నికల్లో ఇచ్చి న ఆమె మేరకు వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని కార్మికులు ఆలోచించి తమ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని తెలిపారు. కార్మికులు ఆత్మహత్యలకు పూనుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందని వారి మాయలో పడి ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తే సంస్థకి నష్టం వస్తుందని కార్మికులు శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు.






