18 July, 2026 | 8:22 PM

Breaking News

ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •   సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే   •   ఉపాధ్యాయులకు ట్రాఫిక్, సైబర్ నేరాలపై అవగాహన   •   నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత   •   కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభం   •  

ఎల్ నినో ప్రభావం.. వరి సాగుపై పునరాలోచించండి

18-07-2026 07:40 PM

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: కేవీకే, వ్యవసాయ శాఖ సూచన

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఎల్ నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఈ ఖరీఫ్‌లో వరి సాగుకు దూరంగా ఉండాలని, స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మండలంలోని సోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి పొలంలో పచ్చిరొట్ట ఎరువులను కలియదున్నే కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అనంతరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనం పెరిగి నేల సారవంతం కావడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల కంటే కంది, పెసర, బొబ్బర్లు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.