25 July, 2026 | 10:29 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

మదనన్నపై అసత్యపు ఆరోపణలు రాస్తే ఊరుకోం

11-05-2026 01:00 AM

తాడ్వాయి,మే, 10( విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు పై అసత్యపు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్న కొందరు గిట్టని వ్యక్తులు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంజీవులు, మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి నాయకులు మహేందర్ రెడ్డి, షౌకత్ అలీ, మేకల రాజు, రఘుపతిరావు పాల్గొన్నారు.