calender_icon.png 14 February, 2026 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం

14-02-2026 01:08:36 AM

  1. తొలిసారి కరీంనగర్‌లో ఎగరేశాం
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్ని కుట్రలు చేసినా గెలిచాం
  3. కేంద్రమంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ‘ఈరోజు నాకు పట్టలేని సంతోషం ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేసి, ఓటుకు 7 వేలు ఇచ్చా యి. చివరకు బీజేపీ అభ్యర్థులను, నాయకులను ప్రలోభపెట్టేందుకు కుట్రలు చేసినా పాచిక పారలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎంఐ ఎం ఓవైసీ బ్రదర్స్‌ను పిలిచి రెచ్చగొట్టే ప్ర యత్నం చేసినా ప్రజలు నమ్మ లేదు. తెలంగాణలో తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేసి రికార్డు సృష్టించాం.

కరీంనగర్ తీర్పు స్ఫూర్తితో భాజాప్త చెపుతున్నా.. హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఒవైసీకి రాసిచ్చారని, అదే రేవంత్‌రెడ్డి పాలిట మరణ శాసనం కాబోతోందన్నారు.

హైదరాబాద్‌తోపాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరే షన్లపై కాషాయ జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేయడం గొప్ప విషయమన్నారు. ప్రజలు తమకు మెజార్టీని ఇచ్చి, ఈ అద్భుత అవకాశాన్ని అందించి, మోదీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు.

ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నయాపైసా ఇయ్యలేదన్నారు. ప్రజలు బేరీజు వేసి ఆశీర్వదించారని, ఇప్పుడు 30 సీట్లు గెలిచామని, కొన్ని కారణాలవల్ల మరో ముగ్గురికి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారని, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు వస్తున్నారన్నారు. అందరూ షాక్‌తినేలా ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నారని చెప్పారు.

మొత్తం 66 డివిజన్లలో సర్వే చేసి 56 మందికి కట్టర్ బీజేపీ కార్యకర్తలకే సీట్లు ఇచ్చామని, 33 మంది గెలిచారని చెప్పారు. 100 ఓట్లలోపు తేడాతో మరో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్..  బీజేపీ అభ్యర్థులను ఆదరించిన కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్ అని అన్నారు. ‘నేను మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్న..

సేవ చేసే అవకాశం కల్పించాలని మొక్కుకున్నా.. ఆ తల్లి ఆశీర్వాదం ఈ గెలుపుకు ప్రధాన కారణమన్నారు. అమ్మవారి దయతో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తా, కరీంనగర్ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేస్తా, ప్రజల వద్దకే పాలనను తీసుకెళతా’ అని బండి సంజయ్ కుమార్ తెలిపారు.