18 June, 2026 | 12:47 PM

కేటీఆర్ స్థాయికి తగ్గట్లగా మాట్లాడాలి

18-06-2026 11:39 AM

జిల్లాలో మంత్రులు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే విమర్శలు

నేలకొండపల్లి,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు. కెటిఆర్ స్థాయికి దగ్గ మాటలు మాట్లాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు అన్నారు. ఖమ్మం జిల్లా, రూరల్ మండలంలో జరిగిన పార్టీ మీటింగ్ లో కెటిఆర్ చేసిన వాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్ల అధికారంలో ఉండి ఖమ్మం జిల్లా ను అభివృద్ధి చేయలేక పోయారని, ఏనాడు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందించలేకపోయారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని తెలియజేశారు. మా జిల్లా మంత్రులు ప్రజల్లో నుంచి వచ్చిన వారని నీవు తండ్రి పేరు చెప్పుకొని నాయకుడయ్యావని దుయ్యబట్టారు. మా జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. మా జిల్లా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే తిరిగి జిల్లాలో ఒక్క సీటు కూడా రాదనే ఉద్దేశంతో కేటీఆర్ మతి బ్రమించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మీ అహంకార పొగరు మాటలకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని, బిఆర్ఎస్ పార్టీ భూ స్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు.