7 April, 2026 | 2:47 AM

కలిసికట్టుగా పనిచేసి సంఘాన్ని అభివృద్ధి చేయాలి

07-04-2026 12:59 AM

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి):.నూతనంగా ఎన్నికైన భట్రాజ్ కుల సంఘం  సభ్యులు కలసి కట్టుగా పనిచేసి సంఘాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నికల అధికారులు జయవీర్ రాజు, మహేందర్ రాజు సూచించారు. హనుమకొండలో సోమవారం భట్రాజ్ కుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుల కుటుంబ సభ్యులు దాదాపు వంద మంది పాల్గొన్నారు.

గతంలో పనిచేసిన సంఘం సభ్యులు చేసిన పలు కార్యక్రమాలను సభకు ముందు ఉంచారు. తదుపరి మూడు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నివేదికను కార్యదర్శి పుస్తక రూపంలో ప్రతి ఒక్కరికి అందజేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఇరవై ఒక్కరితో కూడిన  కులసంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అధ్యక్షుడి గా రఘు రామరాజు, కార్యదర్శిగా శ్రీధర్ రాజు, కోశాధికారిగా ఆనంద గజపతి రాజును ప్రకటించారు.