13 July, 2026 | 3:29 AM

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి

13-07-2026 01:31 AM

మహబూబాబాద్, జులై 12 (విజయక్రాంతి): కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మికుల, కర్షకుల, గ్రామీణ పేద ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరమాండ్ల జగన్నాథం భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న అధ్యక్షతన ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి,  కాంట్రాక్టర్లకు ధనిక వర్గానికి లాభ కలిగించే విధంగా వివిజి రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులను తెచ్చిందన్నారు.

వివిజీ రాంజీ చట్టంలో 125 రోజులు పని దినాలు పెంచారని, పెరిగిన పని దినాలు కనుగుణంగా నిధులు పెంచలేదని, పైగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 90 శాతం నిధుల్లో 60 శాతం మాత్రం ఇస్తామని, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని, వ్యవసాయ సీజన్లో 60 రోజులు పని దినాలు బందు చేయాలని పథకంలో పేర్కొనడం వల్ల, రాజ్యాంగ బద్ధంగా పేదలకు పని కల్పించే బాధ్యతనుండి తప్పుకోవడమే అవుతుందన్నారు. విద్యుత్ సవరణ చట్టం 2025 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై జూలై 15 నుండి ఆగస్టు 10 వరకు గ్రామస్థాయి నుండి జిల్లా వరకు ఆందోళన పోరాటాలు నిర్వహించాలని, ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు ఆకుల రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, కందునూరు శ్రీనివాస్, కుమ్మరి కుంట నాగన్న, పోతుగంటి మల్లయ్య, తిరుపతమ్మ, తోట శ్రీనివాస్, పాల బిందెల మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి యాకూబ్, జిల్లా సహాయ కార్యదర్శి నక్క సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, గొడిశాల వెంకన్న, హేమ నాయక్, బొజ్జం వెంకటేశ్వర్లు, నల్లపు సుధాకర్ పాల్గొన్నారు.