10 March, 2026 | 3:45 AM

హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులు సాధించాలి

10-03-2026 02:28 AM
  1. గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట 
  2. బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభు త్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గ్రామా ల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతి నిధుల పాత్రను బలపర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

సోమవారం సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రట రీ సంజయ్ కుమార్, శాఖకు చెందిన అన్ని విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సం వత్సరంలో బడ్జెట్ వినియోగం, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. విభాగాల వారీగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రికి సమర్పించగా, వాటిలో పలు మా ర్పులు చేయాలని మంత్రి సూచించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావా ల్సిన నిధులను పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కేంద్ర నిధులు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రానికి హక్కుగా రా వాల్సిన వాటాను తప్పకుండా సాధించాలన్నారు.

కేంద్రానికి రాష్ట్రం భారీగా పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థం గా సాధించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.  ఉపాధీ హమీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశ పెట్టిన వీబీ జీ రాం జీ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదని పేర్కొన్న మంత్రి సీతక్క.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధీ కల్పన కో సం బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

శాఖలోని అన్ని విభాగాలు తమ ప్రగతి నివేదికలను క్రమం తప్పకుండా రూపొందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జల సంరక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఉత్తమ రాష్ట్రంగా అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే విధం గా అన్ని విభాగాలు మెరుగైన పనితీరు కనబరచాలని అన్నారు. 99 డేస్ ప్రణాళికల్లో పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ నంబర్ వన్ స్థానం లో నిలవాలని ఆకాంక్షించారు.

జిల్లాల వారీగా నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 నాటికి ఈ భవనాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నా రు.

వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి ఎద్ద డి సమస్యలు ఎదురవుతున్నందున వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాగులు, వంకలు, తోగులపై చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ఉపా ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.