29 March, 2026 | 1:42 AM

‘పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా’

29-03-2026 12:00 AM

యతీంద్ర, రమ్య దినేశ్ హీరోహీరోయిన్‌గా దర్శకుడు ఏ ఫణీంద్ర తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా’. కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై సురేఖ కొలచెల నిర్మిస్తున్న కామెడీ థ్రిల్లర్ డ్రామా ఇది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

“ఉత్కంఠభరిత థ్రిల్లర్. ఒకే రాత్రిలో ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగే కథ. మా చిత్ర హీరో యతీంద్ర విభిన్నమైన బ్రాహ్మణ గెటప్‌లో కనిపిస్తారు. ఏప్రిల్ 15 తర్వాత చిత్రీకరణను ప్రారంభించి, 40 రోజుల్లో పూర్తి చేస్తాం” అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుటు; సంగీతం: అవినాష్ కురుమానా; ఎడిటర్: ప్రశాంత్ తేజ.