11-02-2026 02:14:10 AM
ఉప్పల్/ఎల్బీనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అనేక అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, మహానగర ప్రజలకు మౌలిక, కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడానికి అన్ని డివిజన్లకు భారీగా నిధులు మంజూరు చేశామని ఐటీ, పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 380 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో రూ.116 కోట్ల అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ, హస్తినాపురం, వనస్థలిపురం డివిజన్లలో రూ.45 కోట్ల అభివృద్ధి పనులకు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, బొగ్గారపు దయానంద్, కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, రాగుల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు శంకు స్థాపనలు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 195 కోట్ల 20 లక్షలు రూపాయలతో అభివృద్ధి పనులు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంలోనే 300 కోట్ల నిధులు ఉప్పల్ నియో జకవర్గ అభివృద్ధి కేటాయించామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కాకుండా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లను అభివృ ద్ధి నిధులు కేటాయించి కార్పొరేషన్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన రెండు సంవత్సరాల్లో సంవత్సరాల్లో చిత్తశుద్ధి ఒక కార్యచ రణ తీసుకొని మేము నిదర్శనంగా నిలిచామన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో నల్లచె రువు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరణగా అక్కడున్న కాలుష్య నివారణ ఎస్ టి పి ప్లాంట్ ఏర్పాటు ఏర్పాటుచేసి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నామని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి జరగదు అనే నేపంతో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు భయాలను ప్రజల మధ్య సృష్టిస్తున్నారన్నారు. నగరంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా బ్రిడ్జీలు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, నాలాల విస్తరణ చేపడుతున్నట్లు వివరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కీ నేతృత్వంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అభినందించారు. ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.760 కోట్ల నిధులతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఉప్పల్‌లో కార్పొరేటర్లు రజిత పరమేశ్వర్‌రెడ్డి, బొంతు శ్రీదేవి పాల్గొన్నారు.
ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, చెన్నగోని రవీందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్, బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి, బొగ్గారపు శరత్ చంద్ర, దాము మహేందర్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్‌గౌడ్, నేలపాటి రామారావు, బుడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.