23 May, 2026 | 1:12 AM

రైతు బాగుంటేనే అందరం బాగుంటాం

23-05-2026 12:07 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్, మే 22 : రైతు బాగుంటేనే మన అందరం బాగుంటామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోవ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన  స్టాల్ ను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తో కలిసి ప్రారంభించారు.  ఈ స్టాల్ లో నానో యూరియా, నానో డి. ఏ. పి.ప్రదర్శించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పచ్చి రొట్టె విత్తనాలను 50 శాతం సబ్సిడీపై 10 మంది రైతులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,కలెక్టర్ ఖుష్బూ గుప్తా   పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్పి డి జానకి,జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేష్ లు పాల్గొన్నారు.