7 August, 2026 | 11:57 AM

భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక చేనేత

07-08-2026 10:55 AM

జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం మన చేనేత అని గుర్తుచేస్తూ, జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేనేతలకు, నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతలు, చేనేత కార్మికుల శ్రమ, కళాత్మకత, సృజనాత్మకతకు గౌరవం ఇవ్వడం, వారి జీవనోపాధిని బలోపేతం చేయడం, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించడం, సంప్రదాయ కళలను పరిరక్షిస్తూ అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని సూచించారు.