జలమండలి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మల్కాజిగిరి, ఆగస్టు 27,(విజయక్రాంతి): జలమండలిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘం నాయకులు కోరారు. గురువారం వారు, బీఆర్ఎస్ కేవీ మల్కాజిగిరి అధ్యక్షుడు కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
కేటగిరి–2 కార్మికుల సమస్య లతో పాటు, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సమస్య లను త్వరితగతిన పరిష్క రించాలని కోరారు. కార్మి కుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ కేవీ నాయకులు అశోక్, ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






