30 August, 2026 | 4:31 PM

కాంగ్రెస్ హామీల ఎగవేతపై ఉద్యమం సాగిస్తాం

30-08-2026 03:13 PM

వారం రోజులు దశలవారి కార్యక్రమాలు

కాంగ్రెస్ ది అభయ హస్తం కాదు బస్మాసుర హస్తం

మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆరు గ్యారంటీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులు పాటు బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు విజయవంతం చేయాలని శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభయ హస్తం కాదని భస్మాసుర హస్తమని, ఎన్నికల ముందు తుక్కుగూడ సభలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు డిక్లరేషన్ లపై వంద రోజుల్లో అమలు చేస్తాం.. 

మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రోజులు పాలన పూర్తయినా నేటి వరకు హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కళ్యాణ లక్ష్మి నగదు ప్రోత్సాహంతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని,  500 కే గ్యాస్ పై మోసం, రైతు భరోసాలో ద్రోహం, రెండు లక్షల రుణమాఫీ 40 శాతం కూడా పూర్తి కాలేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని, ఉద్యోగులకు పీఆర్సి, 317 జీవో పై రద్దు, 6డిఏ లు, గృహ జ్యోతి 200ల యూనిట్లు పై మోసం, పూర్తికాని ఇందిరమ్మ ఇండ్లు ఇలా ఎన్నికల ముందు అనేక అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.

వారం రోజులపాటు  ప్రతి మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని, వివిధ దశల్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రెండున తాసిల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు దారి పొడవునా కాంగ్రెస్ మోసం చేసిన హామీలను పెద్ద బ్యానర్ పై వివరిస్తూ ర్యాలీ ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు యాకూబ్ రెడ్డి, ఫరీద్, ఖాశీం, శ్రీను, వెంకన్న, రంజిత్, అశోక్, మహేందర్ రెడ్డి, నజీర్, శేఖర్, నరేష్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.