7 April, 2026 | 9:55 PM

కిండర్ గార్డెన్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుక

07-04-2026 08:02 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం అర్బన్ త్రీ టౌన్ ఏరియా లో గల మాంట్‌ఫోర్ట్ హై స్కూల్‌లో కిండర్ గార్డెన్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి . ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ జాన్ పాల్ హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నారుల విద్యా ప్రయాణంలో కిండర్ గార్డెన్ దశ ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు . ఈ వేడుక పిల్లల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని . విద్యార్థులు గ్రాడ్యుయేషన్ క్యాప్స్ ధరించి తమ ప్రతిభను ప్రదర్శించగా , తల్లిదండ్రులు ఆనందభాష్పాలతో ఈ వేడుకను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బ్రదర్ జోష్ , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు .