అభివృద్ధి పనులు ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు ఉనికిని కోల్పోతున్నారు
ఉప్పల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రచారాలు చేసుకుంటూ బిఆర్ఎస్ నేతలు తమ ఉనికిని కోల్పోతున్నారని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మామిడాల సంతోష్ రెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని బిఆర్ఎస్ నాయకులు 9 సంవత్సరం ల 9 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో నాచారం డివిజన్ కి అత్యంత నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీని ఆయన పేర్కొన్నారు.
9 సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు నాచారం డివిజన్ అభివృద్ధి కోసం తెచ్చారు లెక్క చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాచారం బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త జోకర్ల వ్యవహరిస్తున్నారని ఏదేవ చేశారు. ఎవరు ఏం చేశారనేది నాచారం డివిజన్ ప్రజలు అందరు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతని ఖాయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ నాయకులు వి ఎస్ ప్రకాష్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు




