7 April, 2026 | 9:58 PM

రోగులకు పండ్ల పంపిణీ

07-04-2026 08:10 PM

వైద్యులకు సన్మానం

లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ వైద్యులు డా. అజమత్, డా. ఇమ్రాన్ అందిస్తున్న సేవలను గుర్తించి సన్మానించారు. అవసరమైన రక్త గ్రూపుల ఆధారంగా సుమారు 310 మంది రక్తదాతలతో వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ అనేక మందికి ప్రాణదానం అందించడంలో సహాయపడుతున్న సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులు వారిని అభినందించారు. రక్తదానం కోసం అవసరమైన వారికి సహాయం చేస్తూ పలువురి ప్రాణాలను కాపాడటంలో సహకరిస్తున్న శ్రీకాంత్ (లడ్డు) ను కూడా లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానించారు.