ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ ఆకాష్, కౌన్సిలర్లు వెంకన్న, నాగుబాయి, సాలం
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముగళవారం 19 వార్డు బ్రాహ్మణవాడ పండరినాథ ఆలయం పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మెన్ మెంగ్రె ఆకాష్ కౌన్సిలర్లు నాగుబాయి, చిలువేరు వెంకన్న, సాలాంతో కలసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీల్లో నివాసం ఉంటున్నవారు తమ ఇంటి చెత్తను మున్సిపాలిటీ వాహనాల్లో వేయాలని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచుకొనేందుకు చెత్తాచెదారాన్ని వేయరాదని సూచించారు. కాలనీ శుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని, మున్సిపాలిటీకి చెల్లించే బకాయిలను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ది కీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది సందీప్, కాలనీవాసులు పాల్గొన్నారు.




