రెండో దశ ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ కార్యశాల
22-08-2026 10:50 PM
రెండో దశలోనూ సమన్వయంతో పనిచేయాలి
నర్సాపూర్: నర్సాపూర్‌లోని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో రెండో దశ ఓటర్ల జాబితా సవరణపై కార్యశాల నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత, జిల్లా ఇన్‌చార్జి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులకు రెండో దశకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించారు. మొదటి దశలో ప్రతినిధుల కృషితో తెలంగాణలో మెదక్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, అదే స్ఫూర్తితో రెండో దశలోనూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు, సర్పంచులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.






