22 August, 2026 | 11:47 PM

లోక్ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలి

22-08-2026 10:52 PM

నర్సాపూర్: రాజీకి అవకాశం ఉన్న కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించేందుకు పోలీసు అధికారులు కక్షిదారులకు సహకరించాలని జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచించారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కారం సాధించేలా పోలీసు అధికారులు చొరవ చూపాలని, లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలపై కక్షిదారులకు అవగాహన కల్పించాలని న్యాయమూర్తి సూచించారు. కేసుల పరిష్కారంలో న్యాయ, పోలీసు శాఖల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, చిలప్‌చెడ్ ఎస్‌ఐ నర్సింలు, నర్సాపూర్ ఎక్సైజ్ ఎస్‌ఐ రాఘవేందర్‌రావు, కౌడిపల్లి డబ్ల్యూఏఎస్‌ఐ అండాలు, కోర్టు కానిస్టేబుళ్లు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది పాల్గొన్నారు.