23-02-2026 12:15:35 AM
వరంగల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): సైబరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన నాల్గగవ రాష్ట్ర పోలీస్ స్పోరట్స్ మీట్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు వివిధ క్రీడల్లో అద్బుతమైన ఆట తీరు ప్రదర్శించి తమ సత్తాను చాటారు. ఆరురోజుల పాటు జరిగిన ఈ క్రీడలు శనివారం రాత్రి ముగిసాయి.
ఈ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు మొత్తం 86 పతకాలను సాధించి పతకాల పట్టీకలో మూడవ స్థానంలో నిలిచారు. 12 స్వర్ణ, 25 రజత, 49 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులు ప్రధానంగా అర్చరీ క్రీడలో అత్యధికంగా ఐదు బంగారు పతకాలతో సహా మొత్తం 13 పతకాలను సాధించి అర్చరీ క్రీడలో తిరుగులేని ప్రదర్శన కనబరిచారు. జూడో క్రీడలో వరంగల్ కమిషనరేట్ క్రీడాకారులు నాలుగు రజత పతకాలను సాధించి జూడో చాంఫియన్ షిప్ రన్నరప్గా నిలిచారు.
బాక్సింగ్, ఆరమ్స్ రెజ్లింగ్, రెజ్లింగ్, వెయిట్ లిప్టింగ్, అథ్లెటిక్స్, బ్యాట్మెంటెన్, టగ్ ఆఫ్ వార్లో,సైకిలింగ్, స్మిమ్మింగ్,హకీ విభాగాల్లో గతంలో కన్నా మెరుగైన ఆట తీరు ప్రదర్శించారు. ప్రధానంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సైతం కాంస్య పతకాన్ని సాధించడం విశేషం. అలాగే పోలీస్ చరిత్రలో ఎన్నడూ పుట్బాల్ క్రీడలో పతకం సాధించని వరంగల్ కమిషనరేట్ ఈ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించి క్రీడాకారుల్లో జోష్ను నింపారు. ముఖ్యంగా ఈ క్రీడల్లో అత్యధికంగా పతకాలను సాధించడానికి వరంగల్ పోలీస్ కమిషనర్ క్రీడాకారులను అందించిన ప్రోత్సహమే ప్రధాన కారణంగా క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తుం చేసారు.