4 July, 2026 | 7:29 PM

ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

04-07-2026 06:13 PM

13వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున స్పెషల్ ఇంటెన్సివ్ ఎన్యూమ్యురేషన్ డోర్ టు డోర్ కార్యక్రమం లో భాగంగా శనివారం కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్, బూత్ అధికారిని వాణీ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ నమోదు పత్రాలను అందజేశారు.

ఓటర్ నమోదు పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వయంగా ఓటర్ నమోదు పత్రాలను వారు స్వయంగా నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, కాలనీ వాసులు సహకరించాలని వారు కోరారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉన్న కౌన్సిలర్ కో ఆప్షన్ సభ్యుల దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.