4 July, 2026 | 7:24 PM

సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ 2 కేటాయించాలి

04-07-2026 06:03 PM

- కేంద్ర మంత్రికి వినతి చేసిన జిల్లా బీజేపీ నాయకులు

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఆర్ధిక నష్టాలు తీర్చడానికి తాడిచర్ల కోల్ బ్లాక్- IIను సింగరేణి సంస్థకు కేటాయించాలని కోరుతూ కేంద్ర బొగ్గుల గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని శని వారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర కోశాధికారి వాసుదేవ్, శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్(మంచిర్యాల), ధోనీ శ్రీశైలం(ఆసిఫాబాద్), నిషిధర్ రెడ్డి(భూపాలపల్లి), నెల్లూరి కోటేశ్వర్ రావు(ఖమ్మం), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి, చందుపట్ల కీర్తి రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్య రాణిలు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులు వాడుకొని సంస్థను అప్పుల పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోచుకుంటుంది తప్ప సంస్థను కాపాడటం, కార్మికుల సంక్షేమానికి కృషి చేయడం లేదని విమర్శించారు.

సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం, రూ. 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో సంస్థ పూర్తిగా ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందన్నారు. సింగరేణి సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల కోల్ బ్లాక్- IIను సింగరేణికి కేటాయించి సంస్థ మనుగడను కాపాడాలని, రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.