4 July, 2026 | 7:35 PM

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం కాంగ్రెస్ నాయకుల సంబరాలు

04-07-2026 06:10 PM

తలమడుగు,(విజయక్రాంతి): 9 రోజుల్లో రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడంపై మండల కాంగ్రెస్ శ్రేణులు గురువారం సుంకిడి గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ... గతంలో రైతుబంధు కోసం నెలల తరబడి ఎదురుచూసేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.15,000 చొప్పున ఒకే విడతలో 9 రోజుల్లో జమ చేయడం చరిత్రాత్మకం"అని గణేష్ రెడ్డి అన్నారు. కౌలు రైతులకూ వర్తింపజేయడం రైతు ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణే మా లక్ష్యం. అందుకే రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తున్నాం" అని చెప్పారు.