4 July, 2026 | 7:23 PM

1.855 కిలోల ఎండు గంజాయి పట్టివేత

04-07-2026 05:54 PM

పటాన్ చెరు: రుద్రారం, పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1.855 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న విజయ్ జైస్వాల్ అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

విజయ్ జైస్వాల్ తో పాటు 1.855 కిలోల ఎండు గంజాయి, 2 మొబైల్ ఫోన్లు సాధనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ నుండి రైలు మార్గం ద్వారా గంజాయిని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దీని వెనుక ఉన్న ఇతర వ్యక్తుల నెట్‌వర్క్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.