29 August, 2026 | 3:03 PM

అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్

29-08-2026 01:52 PM

ముకరంపుర, ఆగస్టు 29(విజయ క్రాంతి): చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని కరీంనగర్ సర్కిల్   సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఆర్. రవీందర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని మొత్తం 379 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్ఈ తెలిపారు.విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో అంగన్వాడి కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.