ఆహార భద్రతా మనందరి లక్ష్యం
ఆహార లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా
ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్
భద్రాద్రి కొత్తగూడెం(ఆగస్టు 29 విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు FSSAI ఆహార లైసెన్స్ / రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ శరత్ సూచించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి 31.08.2026, సోమవారం రోజున ఆహార లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూమ్ నెం. F-3, IDOC, పాల్వంచలో వేదికని ఏర్పాటు చేశారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, బేకరీలు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాలు, వీధి ఆహార విక్రయదారులు, ఆహార తయారీదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, ఇతర అన్ని (Food Business Operators) (FBOs) ఈ మేళాను సద్వినియోగం చేసుకుని తమ FSSAI లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందాలని కోరారు. “ప్రతి ఆహార వ్యాపారానికి FSSAI) లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఉండటం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, వినియోగదారులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందించడంలో ముఖ్యమైన భాగం” అని ఈ . శరత్ తెలిపారు.
లైసెన్స్/రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సందేహాలు, (FoSCoS )పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియ తదితర విషయాలపై మేళాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని( FSSAI )లైసెన్స్ / రిజిస్ట్రేషన్ పొందాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ.శరత్ విజ్ఞప్తి చేశారు.






