29 August, 2026 | 4:33 PM

వారిపై వేటు వేయకపోతే పార్టీకే నష్టం.. గుత్తా సుఖేందర్ సంచలన వ్యాఖ్యలు

29-08-2026 01:42 PM
  1. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తగ్గించాలి
  2. 22ఏను రద్దు చేయాలి.. సమస్యను పరిష్కరించాలి
  3. రేవంత్ రెడ్డి యువకుడు.. ఉత్సాహవంతుడు
  4. రేవంత్ రెడ్డికి ఆటంకాలు సృష్టించవద్దు
  5. రేవంత్ కేబినెట్‌లో మార్పు రావాలి

హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy) మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్, ప్రభుత్వంలో మార్పు రావాలని చెప్పారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేస్తే కొత్త దనం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలో క్రమ శిక్షణ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తగాదాలు తగ్గించాలని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటిన వారిపై వేటు వేయకపోతే పార్టీకే నష్టమని హెచ్చరించారు. పార్టీలో లీకేజీలు కంట్రోల్ చేయాలని గుత్తా సుఖేందర్(Gutha Sukender Reddy) పేర్కొన్నారు.

పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని వెల్లడించారు. పింఛన్ ను రూ. 3 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. 22ఏ ను రద్దు చేయాలి.. సమస్యను పరిష్కరించాలన్నారు. ఉచితాలు క్రమంగా తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. చిన్నారెడ్డి(Chinna Reddy) పార్టీ లైన్ దాటి మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఆటంకాలు సృష్టించవద్దన్న గుత్తా సుఖేందర్ స్వచ్ఛనివ్వాలని కోరారు. సామాన్యుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని వివరించారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని  స్పష్టం చేశారు.