calender_icon.png 7 February, 2026 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి లేని లోటు పూడ్చలేనిది

07-02-2026 08:37:59 PM

రాం రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్షలో టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని,(విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన  మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి లేని లోటు పూడ్చలేనిదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు  అన్నారు. శనివారం శ్రీనుబాబు మంథని పట్టణంలోని రాంరెడ్డి కాంప్లెక్స్‌లో వారి నివాసంలో రాంరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాంరెడ్డి కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి లను కలిసి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట సీనియర్ అడ్వకేట్ చందుపట్ల రమణకుమార్ రెడ్డి, తదితరులు ఉన్నారు.