07-02-2026 08:34:42 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): రేపటి నుంచి రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటే ఏఈఓలు, ఏఓలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
యాప్‌లో బుకింగ్ చేసుకున్న రైతులకు తప్పనిసరిగా యూరియా అందించాలని శనివారం ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన రామకృష్ణ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డీలర్ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.