ఇంటర్ ఫలితాల్లో విశాంక్ ఆర్యన్ అద్భుత ప్రతిభ
12-04-2026 03:06 PM
దమ్మాయిగూడ,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర సర్కిల్ దమ్మాయిగూడ కు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి చింతం. విశాంక్ ఆర్యన్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. విశాంక్ మోటార్స్ వ్యవస్థాపకులు చింతం స్వప్న భాస్కర్ దంపతుల కుమారుడు విశాంక్ ఆర్యన్ ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 464/470 మార్కులు సాధించాడు. కాలేజ్ టాపర్ గా నిలిచిన విశాంక్ ఆర్యన్ పట్ల 'గురు శిక్షణ కాలేజీ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు మరియు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.




