calender_icon.png 11 February, 2026 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో మళ్లీ హింస

11-02-2026 01:11:12 AM

ఉఖ్రుల్ జిల్లాలో 50 ఇండ్లకు నిప్పు.. పూర్తిగా దగ్ధం

ఇంటర్నెట్ సేవలు బంద్.. జిల్లాలో కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్, ఫిబ్రవరి ౧౦: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలోని లిటాన్ సారైఖోంగ్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు పదుల సంఖ్యలో ఇళ్లకు నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఘటనలో 50 ఇళ్లవరకు దగ్ధమయ్యాయి. కొందరు గ్రామస్తులు క్షతగాత్రులయ్యారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అలెర్ట్ అయిన.. రాష్ట్రప్రభుత్వం వెనువెంటనే రాష్ట్రంలో ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

దీంతో ఆ రాష్ట్రంలో ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే.. జిల్లావ్యాప్తంగా సర్కార్ కర్ఫ్యూ విధించింది. టాంగ్ఖుల్ నాగా, కుకీ జాతుల మధ్య తలెత్తిన ఘటనకు కారణమి తెలుస్తోంది. ఇటీవల టాంగ్ఖుల్‌నాగా వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేయగా, ఆ మరుసటి రోజున నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు అంచనాకు వచ్చారు.