4 July, 2026 | 7:23 PM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

04-07-2026 05:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని నాగాపూర్ జామ్ గ్రామాల్లో 90 లక్షలతో చేపట్టి అభివృద్ధి పనులకు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శనివారం శంకుస్థాపనలు చేశారు. జామ్ కేజీబీవీ పాఠశాలలో 38 లక్షలతో మౌనిక సదుపాయాల కల్పనకు అభివృద్ధి పనులు మంజూరైనట్టు వివరించారు. నాగపూర్ లో 52 లక్షలతో కమ్యూనిటీ భవనాలు అంగన్వాడి కేంద్రం ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.