21 May, 2026 | 8:09 AM

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

16-12-2025 12:24 AM

కాంగ్రెస్ కండువా కప్పుకొన్న సంకాపురం పెద్ద తాండ్రపాడు సర్పంచులు 

అలంపూర్, డిసెంబర్ 15: గ్రామాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. సోమవారం శాంతినగర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయిజ మండలం లోని సంకాపురం గ్రామ సర్పంచ్ రాజు జాగిర్ధర్ , అలాగే రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు సర్పంచ్ సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచులకు కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు.  రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, ఐజ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ,ఆలయ మాజీ ధర్మకర్త  విశ్వనాధ రెడ్డి ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.