విజయక్రాంతి చైర్మన్ నూతన గృహప్రవేశం
హాజరైన ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, మార్చి 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం దంపతులు, డైరెక్టర్లు శ్రీకాంత్, సౌమ్య దంపతులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముందస్తుగా శనివారం రాత్రి ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం పలువురు ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన వారితో సీఎల్ రాజం కుటుంబసభ్యులు కలుపుగోలుగా సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత గోమాస శ్రీనివాస్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ వంశీ, విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజం మనుమరాలు శ్రీనిధి, మనుమడు శ్రీనందన్, బంధువులు పాల్గొన్నారు.




