ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విజయ క్రాంతి ముందంజ
18-04-2026 08:30 PM
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, ఎప్పటికప్పుడు వార్తలను ప్రచురించడంలో విజయకాంత్రి దినపత్రిక ముందంజలో ఉందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... విజయ క్రాంతి దినపత్రిక వార్షికోత్సవ పురస్కరించుకొని యాజమాన్యం, నెట్వర్క్ ఇంచార్జ్, బ్యూరో చీఫ్, రిపోర్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వార్తలను ప్రచురించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.






