18 April, 2026 | 9:24 PM

Breaking News

పేదింట్ల పెళ్ళికి ఆర్థిక ఆత్మగౌరవ పథకం

18-04-2026 08:27 PM

- కళ్యాణ లక్ష్మి షాదీముభారక్ చెక్కులు పంచిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య

చేవెళ్ల,(విజయక్రాంతి): చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల మండల, మున్సిపాలిటీకి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంకు హర్హులైన 22 మంది లబ్ధిదారులకు రూ. 22,00,352/- విలువైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ... ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం ఇంటి పెదన్న పాత్ర పోషిస్తుందన్నారు. పేద మధ్య తరగతి కుటుంబంబాలకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదింట్ల పెళ్ళికి ఆర్థిక ఆత్మగౌరవ పథకం అన్నారు. ఆడపడుచుల జీవితాల్లో ఆనందం నింపేందుకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.