12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టుకు విజయ్

08-10-2025 12:03 PM
  • న్యూఢిల్లీ: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట(Karur stampede) ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం(Vijay TVK Party) సుప్రీంకోర్టును(Supreme court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. టీవీకే కార్యదర్శి ఆదవ్ అర్జున ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని న్యాయవాది చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్, న్యాయమూర్తి కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తును నిరాకరిస్తూ, సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్టోబర్ 10న విచారించేందుకు మంగళవారం ధర్మాసనం అంగీకరించింది.