27 February, 2026 | 8:12 PM

హుజురాబాద్ ఎంఈఓగా విడపు శ్రీనివాస్

27-02-2026 05:55 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండల నూతన విద్యాధికారిగా విడపు శ్రీనివాస్  ఎంఆర్సి భవనంలో శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఎంఈఓగా పనిచేసిన భూపతి శ్రీనివాస్ స్థానంలో ప్రభుత్వం సిర్సపల్లి గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్న విడపు శ్రీనివాసును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మండలంలో విద్యాభివృద్ధి కోసం అందరినీ సమన్వయం చేస్తూ కృషి చేస్తానని అన్నారు.

విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. మండలంలో ఉత్తీర్ణత శాతం పెరగడానికి అందరి సహకారం తీసుకుంటానని ఆయన అన్నారు. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం పట్ల భూపతి శ్రీనివాస్, కేతిరి నరసింహారెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి,  కట్టా రవీంద్ర చారి,  మండలంలోని ఉపాధ్యాయ సంఘం నాయకులు పి. ఆదర్శన్ రెడ్డి,  టీ. మాధవరావు,భాగ్యరేఖ, ఈశ్వర్ రెడ్డి, రాజేందర్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శోభారాణి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఆత్మీయులు తదితరులు పాల్గొని అభినందించారు.