5 May, 2026 | 12:36 PM

రైతు మేళాకు బయలుదేరిన రైతులు

05-05-2026 11:12 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు మహబూబాబాద్ జిల్లా నుండి రైతులు బయలుదేరి వెళ్లారు. 5,6,7 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే ఈ మేళాకు మహబూబాబాద్ జిల్లా పరిధిలో 13 బస్సుల ద్వారా ప్రతిరోజు బస్సు కు 50 మంది చొప్పున రైతులను రైతు మేళాకు పంపించేందుకు ఏర్పాటు చేసినట్లు డి ఏ ఓ సరిత తెలిపారు. వ్యవసాయ అభివృద్ధిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్ర సాంకేతిక విధానం, వాణిజ్య పంటల సాగు తదితర అంశాలపై మేళాలో ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.