27 February, 2026 | 11:33 PM

Breaking News

ఎంపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

27-02-2026 05:58 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కొత్త జాతీయ రహదారులపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనీ కలిసి వినతిపత్రం సమర్పించడం పట్ల దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ రహదారిలో భాగంగా కామారెడ్డి జిల్లాలోని బిటిఎస్ పై బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీని తాము కోరగా. ఈ విషయమై కేంద్ర మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయాలి.

కోరగా అందుకుమంత్రి స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ సెట్ కార్ కు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కి. కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, సర్పంచ్ ఐరేని నరసయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, మర్రి శేఖర్,మల్లారెడ్డి పెంటయ్య,తోపాటు పలువురున్నారు.