16 July, 2026 | 1:37 AM

మందకృష్ణ మద్దతు కోరుతూ బాధితుల వినతి

16-07-2026 12:00 AM

మొయినాబాద్, జులై 15 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ (సర్వే నంబర్ 151) ఇళ్ల స్థలాల బాధితులు తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగకు వినతిపత్రం అందజేశారు. 2007లో ప్రభుత్వం కేటాయించిన 60 గజాల స్థలాలను ప్రస్తుతం గుడిమల్కాపూర్ మార్కెట్కు కేటాయించడంతో లబ్ధిదారులు గత 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ పోరాటానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా వారు మంద కృష్ణను కోరారు.