16 March, 2026 | 10:53 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి

16-03-2026 08:21 PM

మూత్రనాళాల్లో రాళ్లు రావడంతో ఉబ్బిపోయిన ఎద్దు 

రైతు ఇంటికి వచ్చి ఎందుకు శత్రు చికిత్స చేసిన పశువైద్యాధికారి గుంచెటి విఠల్ 

రెండున్నర గంటలు శ్రమించి మూత్రాన్ని బయటకు పంపించడంతో చావు బతుకుల్లో ఉన్న ఎద్దు కు జీవం 

అప్పటివరకు చావ బతుకుల్లో ఉన్న ఎద్దు లేచి నిలబడడంతో..

అభినందించిన గ్రామ రైతులు

కుభీర్,(విజయక్రాంతి)మూత్రనాళాల్లో రాళ్లు వచ్చి మూత్రం ఆగిపోయి కడుపు ఉబ్బిపోయి నాలుగు రోజులుగా అష్ట కష్టాలు పడుతున్న ఎద్దుకు భైంసా పట్టణ పశు వైద్యాధికారి డాక్టర్ గుంశెట్టి విట్టల్ సమాచారం అందుకున్న వెంటనే 25 కిలోమీటర్ల దూరంలోని పార్డి (కె) గ్రామానికి వచ్చి రెండున్నర గంటలు శ్రమించి శస్త్ర చికిత్స చేసి మూత్రాన్ని బయటకు పంపించడంతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఎద్దు లేచి నిలబడింది.

ఎంతో శ్రమించి రూ.70 వేల ఎద్దును ప్రాణాపాయం నుంచి కాపాడిన పశువైద్యాధికారి గుం చెట్టు యజమాని రైతుతోపాటు మిగతా గ్రామ రైతులు ఆయన్ను అభినందించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్ కు చెందిన అరక నడిచే ఎద్దు గత నాలుగు రోజులుగా మూత్రం చుక్కలు చుక్కలుగా పోయడాన్ని గమనించిన రైతు స్థానిక పల్సి పశు వైద్యాధికారితో వైద్యం చేయించారు. అయినప్పటికీ రోజురోజుకీ కడుపు బాగా ఉబ్బిపోవడంతో భైంసా పశువైద్యాధికారి విట్టల్ సంప్రదించారు.

దీంతో ఆయన గ్రామానికి చేరుకొని అక్కడే ఎందుకు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడారు. చనిపోతుందని అనుకున్న రైతు ఎద్దు లేచి నిలబడడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎద్దు యధావిధిగా మూత్రం పోస్తుండడంతో ఊపిరి పిల్చుకున్నారు. చనిపోతది అనుకున్న ఎద్దు లేచి నిలబడంతో గ్రామంలోని రైతులందరూ ఆయనను  వేనోళ్ళ పొగిడారు. ఈయన వెంట పల్సి, భైంసా పశువైద్యశాల సిబ్బంది ఉన్నారు.