19 August, 2026 | 7:29 PM

ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

19-08-2026 06:24 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ  లో ఫోటోగ్రాఫర్లుగా విశేష సేవలు అందిస్తున్నGH వెంకటేష్‌ నరసింహులు లను ఐటీడీఏ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భాగంగా వెంకటేష్‌ నర్సింలు లకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు.

సమాజంలో, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైనదని అధికారులు ఈ సందర్భంగా కొనియాడారు. నిరంతరం శ్రమిస్తూ, వార్తలకు సజీవ రూపం ఇచ్చే ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి దామోదర స్వామి ఐటిడిఏ మేనేజర్ శ్యామల ఐసిడిఎస్ ఉమాదేవి  ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది,  పాల్గొన్నారు.