ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
19-08-2026 06:17 PM
మిడ్జిల్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు పాపకంటి మహేష్ నూతన జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలందించిన దృశ్య విప్లవకారుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాపకంటి మహేష్ మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ అనేది కేవలం చిత్రాలను బంధించే కళ మాత్రమే కాకుండా, చరిత్రను, సంఘటనలను భవిష్యత్ తరాలకు అందించే అద్భుతమైన మాధ్యమమని అన్నారు.






